ప్రధాని మోదీ సమక్షంలో తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు మరో ముందడుగు
హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వికసిత్ భారత్ లక్ష్యాలతో కలిసి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.