ప్రధాని మోదీ సమక్షంలో తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు మరో ముందడుగు

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి, 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా తెలంగాణను దేశ అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.